Monday, January 20, 2025

తెలంగాణలో రెండు రోజులు వర్షాలే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాగల 48గంటలు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది . క్రింది స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రంవైపునకు వీస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. వాయుగుండం డిసెంబర్ 2నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

దీని ప్రభావంతో కోస్తాంధ్ర , రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. డిసెంబర్ ఆరు వరకూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. గురువారం తెలంగాణ రాష్టంలో అసెబ్లీ సాధారణ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచనల మేరకు తేలికపాటి వర్షాలే కురిసే అవకాశం ఉన్నందున పోలింగ్ ప్రక్రియకు ఎటువంటి అంతరాయాలు ఉండవని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News