Sunday, December 22, 2024

అబ్దుల్లాపూర్‌మెట్ లో పరిధిలో దారుణం

- Advertisement -
- Advertisement -

Two dead bodies found in Abdullapurmet

 

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. నగ్నంగా ఉన్న యువతీ, యువకుల మృతదేహాల కలకలం రేపాయి. యువతి మొహం గుర్తుపట్టడానికి వీలులేకుండా ఉందని పోలీసులు తెలిపారు. యువకుడిని యశ్వంత్ గా గుర్తించారు. ఏకాంతంగా ఉన్న జంటను హత్యచేసి, తగులబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని మార్చురీకి తరలించారు. ప్రేమ జంట హత్య..? ఆత్మహత్య..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News