Wednesday, January 22, 2025

Begumpet: నాలాలో కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతంలోని బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు యువకుల మృతదేహాలు నాలాలో కొట్టుకరావడం కలకలం సృష్టిస్తుంది. ఓల్డ్ కస్టమ్స్ బస్తీలో గుర్తుతెలియని రెండు మృతదేహలు నాలాలో కొట్టుక రావడంతో బస్తీ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.  బేగంపేట్ పోలీసులు డిఆర్ఎఫ్, క్లూటీం ఘటన స్థలానికి చేరుకుని యువకుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి అనంతరం మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువకుల వయసు 40 నుంచి 45 ఏళ్ల మధ్యలో ఉంటుందని పోలీసులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News