Thursday, January 23, 2025

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బొలెరో: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

Two dead four injured in road accident at Shamshabad

 

శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పెద్దషాపూర్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బొలెరో ఉన్న ఇద్దరు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతులను వికారాబాద్ జిల్లా మోత్కూరు వాసులు సుహాన్, చంద్రయ్యగా గుర్తించారు. నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News