Monday, December 23, 2024

జెడ్డాలో అమెరికన్ కాన్సులేట్ వద్ద కాల్పులు: ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

జెడ్డా: జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై దాడి చేసిన సాయుధుడితోసహా ఇద్దరు వ్యక్తులు బుధవారం సాయంత్రం భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు సౌదీ గెజిట్ దినపత్రిక గురువారం తెలిపింది. జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ పై దాడి చేసిన సాయుధుడు భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించగా కాన్సులేట్‌కు భద్రతా విభాగంలో పనిచేస్తున్న నేపాలీ కార్మికుడు ఒకరు ఎదురుకాల్పులలో తీవ్రంగా గాయపడి మరణించినట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సంఘటన పూర్వాపరాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు మక్కా పోలీసులు తెలిపారు.

బుధవారం సాయంత్రం 6.45 గంటల ప్రాంతంలో జెడ్డాలోని అమెరికన్ కాన్సులేట్ భవనం సమీపంలో చేతిలో గన్‌తో కారు దిగిన ఒక వ్యక్తి అక్కడ విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బంది కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా పరిస్థితికి అనుగుణంగా భద్రతా సిబ్బంది స్పందించినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News