Saturday, January 18, 2025

ఇద్దరు ప్రాణాలు తీసిన మంకీఫీవర్…. జర జాగ్రత

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: మంకీఫీవర్‌తో ఇద్దరు మృతి చెందిన సంఘటన కర్నాటక రాష్ట్రంలో జరిగింది. వైద్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఉడుపి జిల్లా మణిపాల్ చెందిన వృద్ధుడు(79), శివమొగ్గ జిల్లా హోసనగర్ తాలూకాకు చెందిన యువతి(18) మంకీ ఫీవర్‌తో చికిత్స పొందుతూ చనిపోయారు. శివమొగ్గలో 12, ఉత్తర కన్నడ 34 మంకీ ఫీవర్ కేసులు నమోదయ్యాయని వైద్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరంలో 2288 మంది రోగుల నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షలు జరపగా 48 మందికి మంకీ ఫీవర్ సోకినట్టు గుర్తించామని కర్నాటక ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ రణ్‌దీప్ పేర్కొన్నారు. కోతులను కరిచే కీటకాలు మళ్లీ మనిషిని కుడితే మంకీ ఫీవర్ వస్తుందని వైద్యులు తెలిపారు. తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి లక్షణాలు ఉంటాయని వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి సోకిని వెంటనే చికిత్స తీసుకుంటే త్వరగా నయం అవుతుందని, అలసత్వం వహిస్తే ప్రాణాలకు ముప్పు అని తెలిపారు. ఈ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయించేందుకు ఐసిఎంఆర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతున్నామని అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News