Sunday, January 19, 2025

నెదర్లాండ్స్‌లో కాల్పులు.. ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రోటర్డాం : నెదర్లాండ్స్‌లో గురువారం ఓ సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. రోటర్డాం లో సైనిక దుస్తులలో ఉన్న వ్యక్తి ముందుగా ఇక్కడి ఓ ఫ్లాట్‌లోకి చొరబడి కాల్పులకు పాల్పడ్డాడు. తరువాత ఓ హాస్పిటల్‌కు వెళ్లి కాల్పులు జరిపినట్లు , రెండు చోట్లా చెలరేగిన మంటలను అగ్నిమాపక దళం వెంటనే ఆర్పివేసిందని అధికారులు తెలిపారు. కాల్పుల్లో చాలా మంది చనిపోయినట్లు ముందు వార్తలు వెలువడ్డాయి. ఇద్దరు మృతి చెందినట్లు నిర్థారణ అయినట్లు , వీరి గురించి కుటుంబ సభ్యులకు తెలియచేస్తామని అధికారులు తెలిపారు. రెండు చోట్లా ఒక్కడే కాల్పులు జరిపినట్లు నిర్థారణ అయింది. నిందితుడి పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపారు. దుండగుడు 32 ఏండ్ల వయస్సులో ఉంటాడని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News