Friday, December 20, 2024

కోవిన్ డాటా లీకేజ్ వ్యవహారంలో ఇద్దరి అరెస్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కోవిన్ పోర్టల్ నుంచి సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలకు సంబంధించి బీహార్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నట్లు గురువారం అధికారులు తెలిపారు.

కోవిన్ పోర్టల్‌లోని డాటాను టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆ వ్యక్తి లీక్ చేసినట్లు పోలీసులు ఆరోపిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కోవిన్ పోర్టల్ నుంచి వ్యాక్సినేషన్ తీసుకున్న పౌరుల సమాచారం లీక్ అయినట్లు ఇటీవల కొన్ని వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

అయితే, ఈ వార్తా కథనాలను దురుద్దశపూరితంగా, నిరాధారమైనవిగా ప్రభుత్వం కొట్టివేసింది. కోవిన్ పోర్టల్ సూర్తిగా సురక్షితమైనదని, డాటా గోప్యతకు తగిన భద్రతా ఏర్పాట్లు తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, కోవిన్ డాటా భద్రతకు సంబంధించిన చర్యలను సమీక్షిస్తున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News