Wednesday, January 22, 2025

ఫ్యాక్టరీ గోడ కూలి ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

Two die in factory wall collapse in Medak

 

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు ఓ ఫ్యాక్టరీలో గోడ కూలింది. గోడకూలి ఇంటిపై పడడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను బీహార్ వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News