- Advertisement -
పానీపూరి తినడం అంటే అందరికీ ఇష్టమే కానీ.. అదే పానీపూరి తినడం వల్ల ప్రాణాలు పోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. పానీపూరి తిన్న ఇద్దరు సోదరులు మృతిచెందారు. మృతులను నంద్యాల నుంచి జంగారెడ్డిగూడెంకు వలస వెలపాటి రామకృష్ణ(10), విజయ్(06)గా గుర్తించారు. పానీపూరి తిన్న అన్నదమ్ములకు వాంతులు విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వాళ్ల మృతికి ఫుడ్ పాయిజనే కారణమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
- Advertisement -