Monday, December 23, 2024

రోడ్డు ప్రమాదం… ఫ్లైఓవర్ పైనుంచి పడి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: బైక్ అతి వేగంగా వచ్చి ఫ్లైఓవర్ పిట్టగొడను ఢీకొట్టడంతో పైనుంచి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ముగ్గురు యువకులు డ్యూక్ బైక్ అతివేగంగా ఫ్లైఓవర్‌పై డ్రైవింగ్ చేస్తున్నారు. ఫ్లైఓవర్‌ పై రెండు దారులు ఉండడంతో ముందుకు వెళ్లి పిట్టగొడను ఢీకొట్టారు. దీంతో ముగ్గురు ఫ్లైఓవర్ పైనుంచి కిందపడడంతో చనిపోయారు. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

 

Twitter courtesy by telugu scribe

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News