Monday, January 20, 2025

ప్రాణం తీసిన ఈత సరదా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/దేవరకొండ: ఈత కోసం వెళ్లి ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీకి చెందిన నీల ఆంజనేయులు కుమార్తె నీల జ్యోతి(13), నందిగళ్ల లక్ష్మయ్య కుమారుడు నాగరాజు(25) కాలనీ సమీపంలోని పీర్లబాయికి ఈతకు వెళ్లారు. ప్రమాదవశాతూ ఈత కొడుతు నీటిలో మునిగిపోవడంతో గమనించిన స్థానికులు బయటికి తీసి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడు నాగరాజు మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతురాలు జ్యోతి తల్లి యాదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News