Monday, December 23, 2024

కారు ఢీకొట్టిన లారీ..ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన కుమురంభీం జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానిుకులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని దయగాం మండల కేంద్రానికి చెందిన నాగుల తిరుపతి, నాగేశ్ మహారాష్ట్రలోని చంద్రపూర్ లో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వాంకిడి మండలం గణేష్ పూర్ సమీపంలో కారును లారీ అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ఘటనలో తిరుపతి ఘటన స్థలంలోనే మృతి చెందగా, నాగేశ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో మహిళ కు స్వల్పంగా గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News