Thursday, December 19, 2024

కాటేసిన కొత్త ఫ్లూ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తీవ్రస్థాయి ఫ్లూ హెచ్3ఎన్2 ఇన్‌ఫ్లూయెంజా దుష్ప్రభావంతో దేశంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కర్నాటకలో ఒక్కరు, హర్యానాలో ఒక్కరు ఈ ఫ్లూతో చనిపోయినట్లు అధికార వర్గాలు శుక్రవారం తెలిపాయి. విపరీతమైన దగ్గు, జలుబు, జ్వరం ఇతరత్రా అనారోగ్య పరిస్థితులు వీడకుండా వారం పదిరోజుల పాటు మనిషిని కబళిస్తూ వస్తున్న దశలో ఇది వైరస్ తీవ్రస్థాయి ఫ్లూ అయిన హెచ్3ఎన్2గా నిర్థారణ అయింది. కర్నాటకలో ప్రత్యేకించి బెంగళూరు ఇతర ప్రాంతాలలో గత పదిహేనురోజులుగా ఇన్‌ప్లూయెంజా తీవ్రస్థాయిలో ప్రబలింది. ఈ దశలోనే హస్సన్ జిల్లాలో 82 ఏండ్ల వ్యక్తి హీరే గౌడ మృతి చెందారు . ఈ నెల 1వ తేదీన ఈ వ్యక్తి ఈ వైరస్‌తో మృతి చెందినట్లు నిర్థారణ అయిందని కర్నాటక ఆరోగ్య విభాగం అధికారులు తెలిపారు.

కర్నాటకలో ఇప్పటికే గత మూడు నెలల వ్యవధిలో 90 ఇటువంటి ఫ్లూ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పుడు హస్సన్ జిల్లాలో ఈ ఫ్లూతో మృతి చెందిన వ్యక్తికి మధుమేహం ఉంది. పైగా అధికరక్తపు పోటు సమస్య కూడా ఉందని, ఫ్లూ సోకిన క్రమంలో గత నెలలో ఆసుపత్రిలో చేరగా మృతి చెందారు. రక్తపు నమూనాల పరీక్షలో ఈ వ్యక్తి ఈ వైరస్ తీవ్రతను తట్టుకోలేక చనిపోయినట్లు వెల్లడించారు. ఇక హర్యానాలో ఈ ఫ్లూతో మృతి చెందిన వ్యక్తికి లంగ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్థారణ అయింది. ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్న ఈ జింద్ జిల్లాకు చెందిన 56 సంవత్సరాల వ్యక్తికి జనవరిలోనే ఈ రకం ఫ్లూ వచ్చినట్లు నిర్థారణ అయింది. వైద్యపరంగా చికిత్స జరిగినా ఫలితం లేకపోయింది. ఇటీవలే ఆయన మరణించాడని వెల్లడైంది. ఈ ఇన్‌ఫ్లూయెంజాతో ఇండియాలో తొలి మరణం రికార్డులలోకి చేరింది ఇప్పుడు కర్నాటక రాష్ట్రంలోనే. దీనితో ఈ రాష్ట్రంలో పలు జాగ్రత్తలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News