డ్రగ్స్ కేసు వ్యవహారం ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఆరోపణలతో ‘దసరా’ సినిమాలో విలన్‌గా చేసిన మలయాళ నటుడు షైన్ టామ్ చాకోసి పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా మరో ఇద్దరు ప్రముఖ దర్శకులు అరెస్ట్ అయ్యారు. దర్శకులు ఖలీద్ రెహమాన్, అష్రఫ్ హంజాలతో పాటు వారిన స్నేహితుడు షలీఫ్‌ని కొచ్చిన్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి వీరి ఇంటిలో సోదాలు జరిపిన పోలీసులు కొంత మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ముగ్గురు కొన్నేళ్లుగా సినిమాకు సంబంధించిన చర్చల కోసం ఒకే అపార్ట్‌మెంట్‌లో కలిసే ఉంటున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే ముగ్గురు కలిసి గంజాయి తీసుకుంటున్నారని ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే వీరికి డ్రగ్స్ ఎవరు సప్లై చేస్తున్నారనే విషయంపై కూడా విచారణ చేస్తున్నామని అన్నారు. మలయాళంలో ఇటీవల విడుదలైన మంచి విజయం సాధించిన ‘జింఖానా’ చిత్రానికి ఖలీల్ రెహమాన్ దర్శకత్వం వహించగా.. ‘తమాషా’ అనే చిత్రంతో అష్రఫ్ హంజా దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.