Wednesday, January 22, 2025

కుండపోత వాన.. గూగుల్ చూపిన దారిలో వెళితే..

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : ప్రఖ్యాత దిక్సూచీ గూగుల్ కేరళలో ఇద్దరు డాక్టర్లను దారితప్పించింది. చివరికి వారి కారు పెరియార్ నదిలోకి చేరడంతో వారు మధ్యలో చిక్కుపడి మృతి చెందారు. ఈ దుర్ఘటన ఎర్నాకులం జిల్లాలో జరిగింది. 29 సంవత్సరాల ఈ ఇద్దరు డాక్టర్లు అద్వైత్, డాక్టర్ అజ్మల్ ఓ వైపు కుండపోత వర్షం పడుతున్నప్పుడు సుడులు తిరుగుతున్న నది ప్రవాహంలోకి వెళ్లడం వీరి విషాదాంతానికి దారితీసింది. దారి సరిగ్గా కన్పించకుండా ఉన్న సమయంలో వీరు తమ కారులో కేవలం గూగుల్ జిపిఎస్ చూపిన మ్యాప్‌లను అనుసరిస్తూ వెళ్లారు. ముందు నది ఉందని పలువురు హెచ్చరించినా కేవలం గూగుల్‌ను నమ్ముకునే ముందుకు వెళ్లడం వీరిని చివరికి ముంచేసింది. కారులోని మరో ముగ్గురు వ్యక్తులను స్థానికులు సకాలంలో స్పందించి ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడారు. వీరిని చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.

కొడుంగల్లూరుకు చెందిన ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్లు శనివారం రాత్రి విధులు ముగించుకుని కారులో బయలుదేరారు. వీరితో పాటు డాక్టర్ తబ్సిర్, ఎంబిబిఎస్ విద్యార్థిని తమన్నా, నర్సు జిస్మాన్ ఈ హోండా సివిక్ కారులో బయలుదేరారు. డాక్టర్ అద్వైత్ డ్రైవింగ్ సీటులో ఉన్నారు.ఆదివారం ఆయన పుట్టినరోజు కావడంతో వీరు షాపింగ్ రాత్రిపూట బయలుదేరారు.ప్రమాద ఘటన కోచిలోని గోతుర్థు ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. వీరు ప్రయాణిస్తున్న కారులో వీరు అమర్చుకున్న గూగుల్ మార్గదర్శనంలో చివరి దశలో మ్యాప్‌లో ఎడమవైపు తిరిగాలని సూచించినట్లు, అయితే సరిగ్గా మ్యాప్ కన్పించకుండా ఉన్న దశలో కారు ముందుకు వేగంగా వెళ్లడం , చివరికి ఇది స్థానికులు చూస్తూ ఉండగానే నదిలోకి దూసుకుపోవడం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. నీటిలో సగం మునిగిన కారులో నుంచి ఓ మహిళతో పాటు ముగ్గురిని స్థానికులు రక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News