Monday, December 23, 2024

అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు డ్రైవర్లు మృతి

- Advertisement -
- Advertisement -

Volvo bus collided with parked truck in AP

అమరావతి: అనంతపురం జిల్లా మిడుతూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఎన్ హెచ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని ఓ టిఎస్ ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బెంగళూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బస్సు వేగంగా వచ్చి అదుపు తప్పడంతోనే ఈ రోడ్డుప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News