Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

రామచంద్రాపురం: ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్‌ను కంటైనర్ ఢీకొట్టడంతో ఇద్దరు డ్రైవర్లు దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలపాలైన సంఘటన సంగారెడ్డి జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ములుసింగ్ భదౌరియా (41), ధర్మేందర్ సింగ్ (35) టిప్పర్ డ్రైవర్‌లుగా జీవనం సాగిస్తున్నారు. వీరు బెంగళూరులో నివాసం ఉంటున్నారు. వీరితోపాటు మరో ఇద్దరు కలసి నాలుగు టిప్పర్‌లపై నాగపూర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీద బెంగళూరుకు వెళ్తున్నారు. ఇందులో రెండు టిప్పర్లు ముందు వెళ్లిపోగా వెనుకున్న రెండు టిప్పర్ల లోనే ఒక టిప్పర్ కొల్లూరు రింగ్ రోడ్డుపై బ్రేక్ డౌన్ అయింది.

దీతో ఆ టిప్పర్లకు చెందిన డ్రైవర్లు ములుసింగ్ భదౌరియా, ధర్మేందర్ సింగ్‌లు టిప్పర్ పైనుంచి కిందకు దిగి టిప్పర్‌కి ఏమైందోనని చూస్తున్న క్రమంలో హర్యానాకు చెందిన కంటైనర్ రోడ్డుపై ఆగి ఉన్న టిప్పర్‌ను వేగంగా వచ్చి ఢీకొట్టి టిప్పర్ పక్కనే ఉన్న డ్రైవర్లు ములుసింగ్ భదౌరియా, ధర్మేందర్ సింగ్‌లను ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా కంటైనర్ డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని ఔటర్ రింగ్ రోడ్ ట్రాఫిక్ పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. రింగ్ రోడ్ ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా కంటైనర్ డ్రైవర్, క్లీనర్ పేర్లు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News