Wednesday, January 22, 2025

సరిహద్దులో డ్రోన్లు జారవిడిచిన పేలుడు సామగ్రి

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ము ప్రాంతం అఖ్‌నూర్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద రెండు డ్రోన్లు జార విడిచిన పేలుడు సామగ్రిని, పిస్టల్, కొంతనగదును ఆర్మీ, పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థం ప్యాకెట్లు ఆరు బ్యాటరీ ఆపరేషన్‌పై పనిచేసినట్టు అమర్చి ఉన్నాయని అధికారులు ఆదివారం తెలిపారు. వీటిని పాకిస్తాన్ డ్రోన్లు జారవిడిచినట్టు భావిస్తున్నారు. దేశంలో ఉగ్రవాదులచే భారీ దాడులు చేయించడానికి పన్నిన పథకంలో ఇవో భాగంగా అనుమానిస్తున్నారు.

ఖౌర్ ఏరియాలో చన్ని దెవానో గ్రామం లో ఆరుబయలు పొలంలో ఆదివారం ఉదయం 7.50 గంటల ప్రాంతంలో వీటిని గమనించినట్టు అధికారులు చెప్పారు. బాంబు నిర్వీర్యం చేసే స్కాడ్ వచ్చి ఈ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశాయి. 9 ఎంఎం ఇటాలియన్ పిస్టల్, మూడు మేగజైన్లు, 30తూటాలు, హ్యేండ్ గ్రెనేడ్, రూ. 35 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఆర్మీ వెల్లడించింది. ఇదే ప్రాంతంలో ముందు రోజు ఒక ఉగ్రవాది చొరబాటును అడ్డుకోవడం జరిగింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News