Thursday, January 23, 2025

పోలియో నివారణకు రెండు చుక్కలు: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో రాష్ట్రంలో పోలియో రహిత సమాజం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. పోలియో నివారణకు రెండు చుక్కలు నిండు జీవితం అనే సందేశంతో 5 సంవత్సరాలలోపు పిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఎం.బి.టి నగర్ బస్తీ దవాఖానలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. పోలియో నివారణలో భాగంగా o నుండి 5 సంవత్సారాల వయస్సు గల పిల్లలకు పోలియో చుక్కలు కార్యక్రమం 27 సంవత్సారాలు నుండి కొనసాగుతున్నదన్నారు.

హైదరాబాద్ లో 1998లో పోలియో కేసు నమోదు అయినట్లు అదే విధంగా తెలంగాణలో 2007లో నల్గొండ జిల్లాలో పోలియో కేసు నమోదు అయినట్లు గుర్తు చేశారు. పోలియో నిర్మూలణలో బాగంగా 5 సంవత్సరాలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నగరంలో అన్ని ఏర్పాటు చేసినట్లు మేయర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.  పోలియో కేంద్రాల్లో పోలియో వేయించుకొని వారికి 4,5 తేదీలలో రెండు రోజుల పాటు ఇంటింటికీ వచ్చి 5 సంవత్సర లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలకు సహకరించాలని మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి నగర వాసులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News