Saturday, March 29, 2025

ఈఫిల్ టవర్స్‌పై అమెరికా మందుబాబులు

- Advertisement -
- Advertisement -

పారిస్ : కునుకు అందులోనూ చుక్కపడ్డ తరువాత పట్టే కునుకు మత్తుగానే ఉంటుందేమో. బాగా మద్యం తాగిన ఇద్దరు అమెరికా టూరిస్టులు పారిస్‌లోని ఈఫిల్ టవర్ప్ రాత్రంతా నిద్రపొయ్యారు. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన వీరు రెండుమూడు రోజుల క్రితం ఈఫిల్ టవర్స్ అందాలు చూసేందుకు టికెట్లు కొనుక్కుని వెళ్లారు. తరువాత వీరు మద్యం తాగి భద్రతా సిబ్బంది కన్నుగప్పి టవర్స్‌పై రాత్రంగా హాయిగా నిద్రపొయ్యారు.

ఉదయం 9 గంటలకు టవర్స్‌ను సందర్శకుల కోసం తెరిచేముందు సెక్యూరిటీ గార్డులు తనిఖీలకు వెళ్లారు. అక్కడ పడుకుని ఉన్న ఈ ఇద్దరిని చూసి వీరు కంగుతిన్నారు. వీరు తాగి ఉండటం వల్ల టవర్స్ గురించి పట్టించుకోకుండా అక్కడనే గడిపి ఉంటారని విచారణలోతేలింది. రాత్రంతా టవర్స్‌పై నుంచి తాము చుక్కలు చూస్తూ గడిపామని తెల్లవారుజామున బాగా నిద్రపట్టిందని మందుబాబులు తెలిపారు. వీరిని అతికష్టం మీద కిందికి దింపి దగ్గరిలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీనితో వీరి మత్తు వదిలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News