ఇద్దరికి జైలు శిక్ష
సిద్దిపేట: మద్యం సేవించి వాహనాలు నడిపిన 12 మందికి రూ. 29 వేల రూపాయలతో పాటు ఇందులో ఇద్దరికి జైలు శిక్ష, ఒక్కరికి ఆరు రోజులు, మరో వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సీఐ రవి కుమార్ తెలిపారు. గత మూడు, నాగులు రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీఓ చౌరస్తా, రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా 12 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్‌తో తనిఖీ చేయగా మద్యం సేవించినట్లు రిపోర్టు వచ్చింది. సిద్దిపేట జ్యుడీషియల్ ఫస్టుక్లాస్ మెజిస్ట్రేట్ సల్మాపాతిమా మందు హాజరు పరురిచారు. విచారణ చేసి 12 మందికి రూ.29 వేలతో పాటు ఇద్దరికి జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని వాహనదారులకు సూచించారు. ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ శ్రీధర్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ షకిల్ హైమద్, ఆర్‌ఎస్‌ఐ ఆంజనేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.