Friday, December 27, 2024

విమానంలో కైపులో చిందులు..ఇద్దరు ప్రయాణికుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

 

పాట్నా: న్యూఢిల్లీ నుంచి పాట్నా వెళుతున్న ఇండిగో విమానంలో ఆదివారం మద్యం మత్తులో రచ్చ చేసిన ఇద్దరు ప్రయాణికులను పాట్నా విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇండిగో మేనేజర్ ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదును పురస్కరించుకుని ఆదివారం రాత్రి ఇద్దరు ప్రయాణికులను పోలీసులు అరెస్టు చేశారు. చిత్తుగా మద్యం తాగడమేకాక తమ వెంట మద్యం సీసాలు ఉంచుకున్న ఇద్దరు ప్రయాణికుల ఉరించి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు తెలియచేసినట్లు ఇండిగో తెలిపింది. మద్య నిషేధం అమలులో ఉన్న బీహార్‌లో మద్యం సీసాలు తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. తమ వెంట మద్యం సీసాలు ఉంచుకున్న ఆ ఇద్దరు ప్రయాణికులను పాట్నాలో విమానం ల్యాండింగ్ అయిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News