Monday, December 23, 2024

డల్లాస్ ఆస్పత్రిలో కాల్పులకు ఇద్దరు ఉద్యోగుల మృతి

- Advertisement -
- Advertisement -

Two employees killed in shooting at Dallas hospital

డల్లాస్ : డల్లాస్ లోని మెథొడిస్ట్ హెల్త్ సిస్టమ్ అనే ఆస్పత్రిలో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఒక ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఆస్పత్రి ఉద్యోగులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. సాయుధుడైన నిందితుడు ఆ తరువాత పోలీసు కాల్పులకు తీవ్రంగా గాయపడ్డాడు. మృతుల పేర్లు, వారు ఆస్పత్రిలో ఎలాంటి విధులు నిర్వహించేవారో ఇప్పటికిప్పుడు తెలియ రావడం లేదు. ఈ మరణాలకు ఆస్పత్రి సంతాపం తెలియజేసింది. ప్రియతమమైన తమ ఇద్దరు ఉద్యోగులను కోల్పోవడం తమకు హృదయ విదారకమని , ఊహించని ఈ విషాదం తమను విచారంలో పడేసిందని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. నిందితుని పేరు కూడా ఇంకా తెలియలేదు. ఆయనను పోలీస్ కస్టడీలో వేరే ఆస్పత్రికి తరలించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News