Monday, January 20, 2025

ఒకే రోజు రెండు పరీక్షలు..నష్టపోతున్న విద్యార్థులు

- Advertisement -
- Advertisement -

కోల్‌సిటీ: ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు నిర్వహిస్తున్న అర్హత పరీక్షలు ఒకే రోజు రెండు పెట్టడం ద్వారా విద్యార్థులు నష్టపోయే అవకాశముంది. ఈ నెల 30న మహాత్మ జ్యోతి రావు పూలే కళాశాలలో ప్రవేశాలకు, అదే రోజు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్‌లో ప్రవేశాలకు పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు సదరు పరీక్ష కేంద్రాలు వేర్వేరు జిల్లాలో వేయడంతో చాలా మంది నష్టపోయే అవకాశముంది. దూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు.

ప్రభుత్వం స్పందించి పరీక్ష తేదీలనైనా, లేదా పరీక్ష కేంద్రాలైన మార్చాలని కోరుతున్నారు. మరోవైపు దరఖాస్తు చేసుకునే సమయంలో జ్యోతి రావు పూలే కళాశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 29న ఉంది. తరువాత తేదీని మార్చినట్లు చెబుతున్నారు. అధికారులు వీలైతే రెండు పరీక్షలు ఒకే ప్రాంతంలో గానీ, ఒకే పరీక్ష కేంద్రంలో గానీ పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News