Wednesday, January 22, 2025

ఇద్దరు నకిలీ వైద్యుల అరెస్టు

- Advertisement -
- Advertisement -

బోడుప్పల్ : నకిలీ సర్టిఫికెట్లతో వైద్యులుగా చలామణిలు అవుతూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్న భార్యాభర్తలను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.మంగళవారం పోలీస్ స్టేషన్ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకురల సమావేశంలో మల్కాజిగిరి డిసిపి జానకి  ,ఎస్వోటీ డిసిపి మల్కాజిగిరి జోన్ ఆర్ గిరిధర్‌లు వివరాలను వెల్లడించారు.వరంగల్ జిల్లా ,నర్సంపేట మండల్ ,కొండవల్లి గ్రామానికి చెందిన డాక్టర్ గిరిధర్ లాల్ శ్రీనివాస్తవ్ (35),సురేఖరాణి(35) (టీఎస్పీ,డిగ్రీ) భార్యా భర్తలు ఉప్పల్ ప్రాంతంలోని ఆదర్శనగర్ కాలనీలో ఉంటున్నారు.

వీరిద్దరూ అధిక మొత్తంలో సంపాదించడానికి,హోమియోపతి లో డిగ్రీ చేసిన గిరిధర్ ఎంబీబీఎస్ ,ఎండీ(యూఎస్‌ఏ)తో పాటు వివిధ యూనివర్సిటీలో చదవినట్లు నకిలీ మెడికల్ కౌన్సిల్ నుంచి పొందినట్లు నమ్మిస్తున్నారు.అయితే గత కొన్నాళ్ల నుండి గుండెకు ,డయాబిటీస్‌కు,గైనకాలజీలకు సంబంధించి వ్యాధులకు బోడుప్పల్ బాలాజీ హీల్స్ శ్రీ వెంకటేశ్వర సాయి పేరుతో క్లీనిక్ ,సురేఖ పేరుతో మెడికల్ స్టోర్ ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు.గత సంవత్సరంలో నరగంలోని భర్కుత్‌పురా ,అంబర్‌పేట్, నల్లకుంట మాసబ్‌ట్యాంక్ ,శివమ్ రోడ్డులోని షరిడి సాయి ట్రస్ట్‌లో మెడికల్ కన్సల్టెంట్ గా పని చే శారు.తదితర ప్రాంతాలో క్లీనిక్ అక్కడి నుంచి ఉడాయించి ప్రస్తుతం శివారు ప్రాంతాలలో డాక్టర్లుగా చలామని అవుతూ అమాయకులకు వైద్యం చేస్తూ డ బ్బులు దండుకుంటున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు,మేడిపల్లి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని వారి నుంచి నకిలీ ఎంబీబీఎస్ ,మెడికల్ కౌన్సిల్ ఫేక్ ఐడీ కార్డు ,సర్టిఫికెట్లు ,స్టెత ష్కోప్ ,ఫేక్ రబ్బరు స్టాంపు,పరికరాలను స్వాధీనం పరుచుకుని గిరిధర్ శ్రీహస్తవను,సురేఖరాణిని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News