Wednesday, January 8, 2025

ఇద్దరు నకిలీ విలేకరులు అరెస్టు

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: నకిలీ విలేకరులుగా చెలామని అవుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు మెట్ పల్లి సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. మల్లాపూర్ మండలం సాతారం గ్రామానికి చెందిన చౌడారపు వెంకటరమణ అనే వ్యక్తి కిరాణ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 24న కిరాణ సామాగ్రి కొనుగోలు చేసి తన కారులో తిరుగు ప్రయాణం చేస్తుండగా, గుండమిది రాజశేఖర్ వెంపేట శివారులోని వెంకటేశ్వర ఆలయం వద్దకు తన కారులో వెంబడించి వెంకటరమణ కారుకి తన కారు అడ్డుపెట్టి ‘‘ నీ కారులో తరలిస్తున్న వస్తువులు డూప్లికేట్’’ అని వాటిని చిందరవందర చేసి పోలీస్ స్టేషన్ కు రావాలని ఒత్తిడి చేశాడు.

మరో నకిలీ విలేకరికి పోన్ చేయగా…రామగిరి కార్తీక్ అనే మరో నకిలీ విలేకరి రూ. 10 వేలు డిమాండ్ చేయడమేకాక, ఫోన్ లాక్కొని రూ. 4 వేలను ఫోన్ పే ద్వారా పంపించుకున్నాడు. అక్కడి నుంచి వెళ్లిపొమ్మని, ఎవరికైనా చెబితే చంపి పడేస్తామని కూడా బెదిరించాడు. ఇదిలావుండగా వెంకటరమణ శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదుతో పట్టణంలోని పెట్రోల్ బంక్ వద్ద రాజశేఖర్, కార్తీక్ లను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న కారు, ద్విచక్ర వాహనం, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వ్యాపారవేత్తలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా నేరం జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News