Friday, December 20, 2024

విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి

- Advertisement -
- Advertisement -

చిన్నచింతకుంట : విద్యుత్ షాక్‌తో ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా, చిన్నచింతకుంట మండల పరిధిలోని పర్ధిపురంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన కుర్వ మల్లప్ప (55) గాజు మోహన్ రెడ్డి (57) శుక్రవారం ఉదయం తమ పొలాల వద్ద మోటార్ మరమ్మతు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందారు. మృతదేహాలను జిల్లా హాస్పిటల్‌లో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుర్వ మల్లప్ప కుమారుడు రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News