హైదరాబాద్: భారతీయ న్యాయ సంహిత(బిఎన్ఎస్) కింద చార్మినార్ పోలీస్ స్టేషన్ లో డిజిటల్ సంతకంతో తెలంగాణ పోలీసులు తొలి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని డిజిపి రవి గుప్తా సోమవారం తెలిపారు. గుల్జార్ హౌస్ వద్ద నంబర్ ప్లేట్ లేకుండా బైక్ మీద తిరుగుతున్న ఇద్దరిని పట్టుకుని ఈ కేసు నమోదు చేశారు. కాగా ఆ బండిని కూడా స్వాధీనం చేసుకున్నారు.
మోటార్ వెహికిల చట్టంలోని సెక్షన్ 281 BNS 30 (A)లో సెక్షన్ 173 , 176 BNS ప్రకారం మొదటి డిజిటల్ ఎఫ్ఐఆర్ 2024 యొక్క FIR-no-144 ఇదని గుప్తా తెలిపారు.
రాజేంద్రనగర్ పోలీసులు బిఎన్ఎస్ కింద రెండవ FIR నమోదు చేసినట్లు నివేదించబడింది. 2024లో 637 నంబర్ గల FIR, 106 BNS చట్టం ప్రకారం, ర్యాష్ నిర్లక్ష్యం డ్రైవింగ్ వల్ల సంభవించిన మరణానికి సంబంధించినది. ఇంతకు ముందు ఇలాంటి కేసును ఐపీసీ 304(ఏ) కింద బుక్ చేసేవారు. పివిఎన్‌ఆర్ ఎక్స్ప్రెస్ హైవే పిల్లర్ నంబర్ 295 వద్ద వేగంగా వెళ్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో బాధితుడు సాయి గణేశ్ (25) అనే వ్యాపారి తీవ్రగాయాల పాలయ్యాడు.
“మేము IPC 304 (a)కి బదులుగా కొత్త BNS చట్టంలోని సెక్షన్ 106 కింద కేసు బుక్ చేసాము” అని రాజేంద్రనగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో చెప్పారు.
కొత్త బిఎన్ఎస్ ప్రకారం ఇప్పుడు ఈ నేరానికి ఐదేళ్ల శిక్ష పడుతుందని, ఇదివరలోనైతే ఐపిసి 304 ప్రకారం రెండేళ్లే శిక్ష్ పడేదని ఆయన తెలిపారు.