Friday, April 4, 2025

ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డుల మృతి

- Advertisement -
- Advertisement -

తేజ్‌పూర్ (అస్సాం) అస్సాం సోనిట్‌పూర్ జిల్లాలో శనివారం ఏనుగు దాడికి ఇద్దరు ఫారెస్ట్ గార్డులు ప్రాణాలు కోల్పోగా, మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఢేకియాజులి అడవి నుంచి సమీపాన ఉన్న ధిరాయి మజులీ గ్రామం లోకి చొరబడిన ఏనుగు ఆ ప్రాంతంలో గస్తీ కాస్తున్న ముగ్గురు ఫారెస్ట్ గార్డులపై దాడి చేసింది. వారిని చంపేవరకు వెంటాడింది. దాంతో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయాల పాలయ్యారని పశ్చిమ తేజ్‌పూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ నిపెన్ కలిత చెప్పారు. మృతులు ఫారెస్ట్‌గార్డులు కోలేశ్వర్ బొరొ, బీరెన్ రవాగా గుర్తించారు. స్థానిక వ్యక్తి జతిన్ తంతి గాయపడ్డాడు. ఏనుగును మళ్లీ అడవి లోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News