బరేలి: చదువుకు వయసుతో పనిలేదని పెద్దలు చెబుతారు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు 12వ తరగతిలో ఉత్తీర్ణులయ్యారు. 50వ పడిలో ఉన్న వీరిద్దరూ ఇప్పుడు డిగ్రీ కోర్సులపై గురిపెట్టారు. బరేలి జిల్లాలోని బిత్రీ చెయిన్‌పూర్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మల్యే రాజేష్ మిశ్రాకు మొత్తం 500 మార్కులకు గాను 263 మార్కులు రాగా హస్తినాపూర్ నియోజక వర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రభుదయాల్ వాల్మీకి ఇంటర్‌మీడియట్ పరీక్షలో సెకండ్ డివిజన్‌లో పాసయ్యారు. మంగళవారం పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి.
Also Read: దోస పోసిన ప్రియాంక.. హోటల్‌లో సందడి (వైరల్ వీడియో)
రెండేళ్ల క్రితం తాను 10వ తరగతి బోర్డు పరీక్ష పాసయ్యానని, ఇప్పుడు 12వ తరగతి పాసయ్యానని 55 ఏళ్ల మిశ్రా తెలిపారు. ఎల్‌ఎల్‌బి చదవాలన్నదే తన ఆశయమని, దాని ద్వారా తాను పేద ప్రజలకు న్యాయం లభించేలా చూస్తానని ఆయన అన్నారు. ఆయన 2017 నుంచి 2022 వరకు బిత్రీ చెయిన్‌పూర్ స్థానంలో బిజెపి ఎమ్మెల్యేగా పనిచేశారు. మూడు సబ్జెక్టులలో తనకు లభించిన మార్కుల పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రాయింగ్ డిజైన్, సివిక్స్, ఎడ్యుకేషన్ సబ్జెక్టులలో తనకు మంచి మార్కులు రాలేదని, జవాబు పత్రాలను మరోసారి స్క్రూటినీ చేయాలని కోరతానని ఆయన తెలిపారు.