Sunday, December 22, 2024

జైల్లో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల హత్య..

- Advertisement -
- Advertisement -

అమృతసర్: సింగర్ సిద్ధూ హత్యకేసుకు సంబంధించి రెఢేస్టయిన ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు పంజాబ్‌లోని సాహిబ్ జైలులో హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని టార్న్ తరన్ జిల్లాలో ఈ ఘటన జరిగిందని, జైల్లోని సహచర ఖైదీలతో జరిగిన ఘర్షణలో వీరు చనిపోయారని ఆదివారం తెలిపారు. పలు కేసుల్లో వీరు నిందితులుగా ఉన్నట్లు సీనియర్ ఎస్పీ గుర్మీత్‌సింగ్ చౌహాన్ తెలిపారు. ఘర్షణలో ఓ ఖైదీ గాయపడ్డాడని ఈ ముగ్గురూ ఒకే గ్రూప్ చెందినవారుగా ఎస్సీ చౌహాన్ తెలిపారు. సిద్ధూ మూసేవాలాగా పాపులరైన శుభ్‌దీప్‌సింగ్ సిద్ధూను మాన్సా జిల్లాలో మే29న కాల్చి చంపారు.

ఈ కేసులో ఆరోపణలపై ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మృతులను బటాలాకు చెందిన మన్‌దీప్‌సింగ్ అలియాస్ తుఫాన్, బుద్లాడ నివాసి అలియాస్ మోహనాగా గుర్తించినట్లు ఎసీ తెలిపారు. మరో నిందితుడు కేశవ్ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఖైదీల మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ తీవ్రమవడంతో ఐరన్‌రాడ్లు, పాత్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కేశవ్ కూడా సిద్ధూ హత్యకేసులో నిందితుడిగా పేర్కొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News