మన తెలంగాణ/చేవెళ్ల రూరల్: కారు డోర్ లా క్ కావడంతో ఊపిరి ఆడక ఇద్దరు చిన్నారు లు మృతి చెందిన విషాద ఘటన రంగారెడ్డి జి ల్లా, చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని దామరిగిద్దలో సో మవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యు లు తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని పామెన గ్రామానికి చెందిన కావలి వెంకటేష్, జ్యోతి దంపతుల కుమార్తె తన్మయిశ్రీ (5), షా బాద్ మండలం, సీతారాంపూర్ గ్రా మానికి చెందిన మహేందర్, ఉమారాణి దంపతుల కు మార్తె అభినయశ్రీ (4) తమ మామయ్య తెలు గు రాంబాబు పెళ్లి (ఈనెల 30న) నిమిత్తం దా మరిగిద్ద గ్రామానికి వచ్చారు.
ఇంటి ఎదుట ఉన్న రాంబాబు కారులో ఆ పిల్లలు మధ్యాహ్నం 12ః30 గంటల సమయంలో ఎక్కారు. అయితే, చిన్నారులు కారులో ఉన్న విషయాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు గమనించలేదు. వారిద్దరూ బయట ఎక్కడో ఆడుకుంటున్నారని భావించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో పిల్లల కోసం వెతుకుతూ కారులో చూడగా వారిద్దరూ కారులో సృ్పహ తప్పి పడి ఉన్నారు. వెంటనే లాక్ తీసి కుటుంబ సభ్యులు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ పిల్లల తల్లిదండ్రుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి.