Sunday, January 19, 2025

విషాదం.. పిడుగు పడి ఇద్దరు యువతులు మృతి

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భద్రాద్రి(D) దమ్మపేట మండలం జగ్గారంలో కౌలు వ్యవసాయం చేస్తున్న రవిరాజు చేనులో పనులకు వెళ్ళిన కూలీలు వర్షం పడుతుందని చెట్టు కిందకు వెళ్లారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడటంతో నాగశ్రీ(22), అనూష(23) అనే ఇద్దరు యువతులు చనిపోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండంతో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్‌నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు వృద్ధులు, మరో వ్యక్తి(29) పిడుగుపాటుకు మృతి చెందారు. దీంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News