Monday, December 23, 2024

బెంగాల్‌లో రైలు ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని బంకూరా జిల్లాలో ఆదివారం గూడ్స్ రైళ్ల ప్రమాదం జరిగింది. ఒండా స్టేషన్ వద్ద నిలిపిఉంచిన సరుకు రవాణా రైలును మరో గూడ్స్ వచ్చి ఢీకొందని ఆగ్నేయ రైల్వే సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. భారీ నష్టం ఏదీ వాటిల్లలేదు. అయితే నాలుగయిదు గంటల పాటు ఈ దారిలో రైళ్లరాకపోకలకు అంతరాయాలు ఏర్పాడ్డాయని అధికారి తెలిపారు. తెల్లవారుజామున 4 గంటలకు జరిగిన ఈ గూడ్స్ రైళ్ల ఢిలో ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. సహాయక బృందాలు హుటాహుటిన అక్కడికి చేరుకుని, పునరుద్ధరణ పనులు చేపట్టడంతో ఉదయం ఎనిమిదిన్నర తరువాత తిరిగి రైళ్ల రాకపోకలు సాగాయి.

రెడ్ సిగ్నల్ సంకేతాల ఉల్లంఘన
ఇప్పుడు జరిగిన గూడ్స్ రైళ్ల ప్రమాదంలో సిగ్నల్స్‌ను బేఖాతరు చేసిన విషయం ప్రాధమికంగా వెల్లడైంది. బిసిఎన్ గూడ్స్ రైలు రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ముందుకు సాగిందని దీనితో బిఆర్‌ఎన్ మెంటెనెన్స్ రైలుతో ఢీకొందని నిర్థారించారు. లూప్‌లైన్‌లో నిలిపి ఉంచిన గూడ్స్ వైపు మరో గూడ్స్ దూసుకురావడం ప్రమాదం చోటుచేసుకోవడంతో సిగ్నల్స్ వ్యవస్థల బేఖాతరు అంశం తిరిగి వెలుగులోకి వచ్చింది. ఒడిషాలో ఇటీవలే కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన , వందలాది మంది ప్రాణాలు పోయిన విషయం మరవక ముందే ఈ సిగ్నల్స్ ఉల్లంఘన జరిగింది.

Also Read: సత్తుపల్లి నియోజకవర్గంలో 817 పనులకు రూ.50 కోట్లు నిధులు మంజూరు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News