Thursday, January 23, 2025

భీమా కోరెగావ్ కేసులో ఇద్దరికి బెయిలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భీమా కోరెగావ్ కేసులో సామాజిక కార్యకర్తలు వెర్నన్ గోన్సాల్వెస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వారికి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. మహారాష్ట్రను వీడి వెళ్లవద్దని, పాస్‌పోర్టులను పోలీసులవద్ద సరెండ్ చేయాలని ఆదేశించింది. అలాగే తమ చిరునామాను ఎన్‌ఐఎకు తెలియజేయాలని జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ సుధాంశు ధులియాలతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. హింసను ప్రేరేపించారనే అభియోగంపై యుపిఎపి చట్ట కింద 2018 ఆగస్టులో గోంసాల్వెస్, ఫెరీరాలను ఎన్‌ఐఎ అరెస్టు చేసింది.

అప్పటినుంచి వారు ముంబయిలోని తనేజా జైలులో ఉన్నారు. వారిద్దరి బెయిలు పిటిషన్‌ను 2021 డిసెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించింది.దీంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఐదేళ్లుగా వారు కస్టడీలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొన్న సర్వోన్నత న్యాయస్థానం తాజాగా వారికి బెయిలు మంజూరు చేసింది. వారిపైతీవ్రమైన అభియోగాలు ఉన్నప్పటికీ వారిని జైల్లో ఉంచేందుకు ఆదొక్కటే ప్రాతిపదిక కాదని కోర్టు అభిప్రాయపడింది.

భీమా కోరెగావ్ యుద్ధం శతవార్షికాన్ని పురస్కరించుకొని 2017 డిసెంబర్‌లో పుణెలో ఎల్గార్ పరిషద్ కాంక్లేవ్ నిర్వహించింది. దీనికి మావోయిస్టులు నిధులు సమకూర్చారని పోలీసులు కేసు నమోదు చేశారు.దీంతో మరుసటి రోజు బీమా కోరెగావ్ యుద్ధ స్మారకం వద్ద హింస చెలరేగిందని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో ఇదివరకు వరవరరావుకు బెయిలు లభించిన విషయం తెలిసిందే. మరో నిందితుడు గౌతమ్ నవలఖాను గృహనిర్బంధంలో ఉంచేందుకు కోర్టు అనుమతించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News