Monday, December 23, 2024

మరో రెండు గొప్ప నిజాయితీ కథలతో చిత్రాలు

- Advertisement -
- Advertisement -

‘కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో పాన్ వరల్డ్ విజయాన్ని అందుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్, ఐ యామ్ బుద్దా ప్రొడక్షన్ మానవ చరిత్రకు సంబంధించిన మరో రెండు గొప్ప నిజాయితీ కథలను వెండితెరపై చూపించబోతున్నారు. వీరి కాంబినేషన్‌లో విడుదలైన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ సినిమాని ఆకర్షించింది. 1990లో కాశ్మీరీ పండిట్‌లు ఎదురుకున్న నాటి పరిస్థితులను హృదయాన్ని కదిలించేలా తెరపై ఆవిష్కరించారు. నిజాయితీగా చెప్పిన ఈ కథ కోట్లాది ప్రేక్షకులు మనసులను గెలుచుకుంది.

ఇప్పుడు అంతే నిజాయితీతో వివేక్ రంజన్ అగ్నిహోత్రి, అభిషేక్ అగర్వాల్, పల్లవి జోషి మరో రెండు నిజాయితీ గల కథలను వెండితెరపై చూపించాలని సంకల్పించారు. ఇక 250 కోట్ల క్లబ్‌లో చేరిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరుస్తూ ప్రదర్శింపబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ఈ చిత్రాన్ని అభినందించారు. ఇక తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్, వివేక్ రంజన్ అగ్నిహోత్రి, పల్లవి జోషి ఈ రెండు చిత్రాలను నిర్మించనున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాలను ప్రకటించారు. ఈ చిత్రాలకు సంబధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News