Monday, December 23, 2024

షార్ట్ సర్క్యూట్ తో రెండు ఇల్లులు దగ్ధం

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం శాంతినగర్ గ్రామంలో ప్రమాదవశాత్తు రెండు పూరి గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి. ప్రత్యక్ష సాక్షుల తెలిపిన వివరాల ప్రకారం దానవేన తిరుపతి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు చేలరేగగా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలి పక్కనే ఉన్న చింతనిప్పుల దశరధం ఇంటికి మంటలు వ్యాపించి అంటుకున్నాయి.

మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరు లేక పోగా రెండు ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యాయి. రెండు ఇల్లకు చెందిన బట్టలు, బిరువా బియ్యం, పత్తి , బంగారం, నగదు ఏమి లేకుండా పూర్తిగా కాలిపోయాయి.ఇది చూసిన కుటుంబ సభ్యులు బోరున విలిపించారు.ఈ ప్రమాద ఘటనతో శాంతి గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News