Monday, December 23, 2024

పశ్చిమ ఇంఫాల్‌లో రెండు ఇళ్లకు నిప్పు

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపూర్‌లోని పశ్చిమ ఇంఫాల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రెండు నిర్జన ఇళ్లకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. లంగోల్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశాయి.

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని ఒక అధికారి తెలిపారు. పోలీసులు డ్యూటీ మారుతున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. మే నెలలో ఘర్షణలు మొదలైన తర్వాత మైతేయ తెగ ప్రాబల్యం అధికంగా ఉన్న పశ్చి ఇంఫాల్ నుంచి గిరిజనులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News