Thursday, December 26, 2024

అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు హైదరాబాదీ విద్యార్థుల మృతి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు మరణించారు. కెంటుక్కీలోని జాన్స్‌బర్గ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు గాయపడగా ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మూడో విద్యార్థి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వీరంతా ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. మరణించిన విద్యార్థులను మొహమ్మద్ పైజల్, ఇషర్‌ముద్దీన్‌గా గుర్తించారు. సెయింట్ లూయీలోని దార్ ఇస్లాం మసీదులో మృతుల కోసం ప్రార్థనలు(నమాజ్ ఇ జనజా) జరిగాయి. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు అక్కడే అంత్యక్రియలు జరిగాయి.

Also Read: ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని యువకుడి దారుణ హత్య

గత నెలలో మిస్సోరీ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటున్న భారత్‌కు చెందిన సాహితీ అనే విద్యార్థిని కారులో ప్రయాణిస్తుండగా అమెరికా హై 71లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను మిస్సోరీలోని మొజాయిల్ లైఫ్ కేర్‌లో చేర్చారు. ఇటీవల..న్యూజెర్సీలో జరిగిన మరో సంఘటనలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్ దిగాల అనే 39 ఏళ్ల వ్యక్తి మరణించారు. ప్రిన్స్‌టన్ జంక్షన్ స్టేషన్‌లో ఇంటర్ సిటీ రైలు ఢీకొని ఆయన మరణించారు. న్యూజెర్సీలోని మెయిన్స్‌బరోలో ఆయన నివసిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News