- Advertisement -
బెంగళూరు: హెచ్3ఎన్2 వైరస్ కారణంగా వచ్చిన ఇన్‌ప్లూయెంజా వ్యాధి వల్ల దేశంలో ఇద్దరు మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకరు హర్యానాలో చనిపోతే, మరొకరు కర్నాటకలో చనిపోయారు. మరొకరు హర్యానాలో చనిపోయారు. కర్నాటకలోని హసన్‌కు చెందిన జిల్లా ఆరోగ్యశాఖ అధికారి ప్రకారం మార్చి 1న హిరే గౌడ వైరస్ వల్ల చనిపోయాడు. ఆయన డయాబెటిక్, హైపర్‌టెన్షన్‌తో కూడా బాధపడ్డాడు.
ఈ వ్యాధి సంక్రమణ 15 ఏళ్ల కంటే తక్కువ వయస్సు వారిలోనూ, 65 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజెన్స్‌లో కూడా కనబడుతోంది. గర్భిణీ స్త్రీలు ఎక్కువగా దీని బారిన పడే అవకాశం ఉంది.
- Advertisement -