Friday, December 20, 2024

ఢిల్లీ కోర్టు కాంప్లెక్స్ లో అనుకోకుండా పోలీస్ కాల్పులు

- Advertisement -
- Advertisement -

Delhi court Complex firing

 

న్యూఢిల్లీ: ఢిల్లీలోని రోహిణి కోర్టు కాంప్లెక్స్ లో  నాగాలాండ్ సాయుధ పోలీస్ కానిస్టేబుల్ అనుకోకుండా కాల్పులు జరుపగా ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరు న్యాయవాదులు పోట్లాడుకుంటుండగా వారిని ఆపడానికి ప్రయత్నించినప్పుడు అనుకోకుండా ఆ కానిస్టేబుల్ తుపాకీ పేలింది. వాస్తవానికి తుపాకీ గుండు నేలకు తాకింది. కానీ ఆ తూటా కవచం రెండుగా విడిపోయి వారికి తగిలింది. వారికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ ఘటన ఉదయం 9.40కి జరిగింది. ఆ పోట్లాడుకుంటున్న ఇద్దరు ఆ కానిస్టేబుల్ పై కూడా చేయిచేసుకున్నారు. అప్పుడు ఆ కానిస్టేబుల్ ను రక్షించడానికి ఇతర పోలీసులు కూడా పరుగెత్తుకొచ్చారు. పోట్లాడుకున్న ఆ ఇద్దరు న్యాయవాదులు సంజీవ్ చౌదరి, రిషీ చోప్రా అని, మరో వ్యక్తి రోహిత్ బేరీ అని రోహిణి డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రణవ్ తయల్ తెలిపారు. కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన ఆ వ్యక్తులపై చర్య తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News