- Advertisement -
పాల్వంచటౌన్ : విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం పట్టణ పరిధి సబ్ స్టేషన్ వెనుక ఉన్న కట్టా నాగేశ్వరరావు చెందిన డాబాపైన ఏడవ తరగతి, ఎనమిదవ తరగతి చదువుతున్న కట్టా సాయిలోకేష్ బాబు, జానా నాగ తరుణ్ కుమార్ లు ఆడుకొంటున్నారు. ఈ క్రమంలో ఆ ఇంటి పై నుండి వెళుతున్న 33/11 కేవి విద్యుత్ వైర్లతో ఇద్దరు పిల్లలకు ప్రమాదవశాత్తు షాక్ తగిలింది.
ఇద్దరిలో ఒకరికి శరీరం మొత్తం కాలిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకొన్నాడు. హుటాహుటిన చికిత్స కోసం ఒకరిని ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. మరొకరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నివాస గృహాలపై నుండి లాగిన వైర్లను తొలగించాలని పలుమార్లు విద్యుత్ ఆధికారులకు ఫిర్యాదు చే సినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -