Saturday, December 21, 2024

టాటా ఏసీ వాహనాన్ని ఢీకొట్టిన బైక్: ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

 

వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని రామంతాపూర్ గ్రామ శివారు లో 44 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న టాటా ఏసీ వాహనాన్ని అదుపుతప్పిన బైక్ వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. మాసాయిపేట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి బైక్ ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. స్పందించిన స్థానికులు అతన్ని చికిత్స నిమిత్తం తక్షణమే హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. బైక్ పై వెనుక కూర్చున్న మాసాపేట గ్రామానికి చెందిన యువతకి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News