Thursday, January 23, 2025

గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట ః గ్యాస్ సిలండర్ పేలి ఇద్దరికి గాయాలైన సంఘటన మూడు చింతలపల్లి మండలం ఆద్రాస్‌పల్లిలో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఆద్రాస్ పల్లి గ్రామంలో భాస్కర్ అనే వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోవడంతో ఖాళీ అయిన సిలిండర్ తీసి మరో సిలిండర్ బిగించాడు. ఈ క్రమంలో రెగ్యులేటర్ సరిగా బిగించకపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి సిలిండర్ పేలింది. ఈ పేలుడు దాడికి ఇంట్లోని వస్తువులు సామాగ్రి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదంలో భాస్కర్‌తో పాటు ఆయన కుమారుడు వరుణ్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News