Monday, January 20, 2025

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కుంటాల : మండలంలోని కల్లూర్ గ్రామంలోని 61వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కుంటాల ఎస్‌ఐ హన్మండ్లు తెలిపిన వివరాల ప్రకారం… భైంసా నుంచి ఎంహెచ్ 26 బీఈ 3032 నిర్మల్ వైపు బొలేరో వాహనం వెళుతుంది. నిర్మల్ వైపు నుంచి కుంటాల మండలం దౌనెల్లి గ్రామపంచాయతీ కి సంబంధించిన ట్రాక్టర్ టీఎస్ 18 జి 0842 హరితహరం మొక్కలతో వెళుతోంది దీంతో కుంటాల ఎక్స్ రోడ్డు వద్ద బులోరావాహనం, ట్రాక్టర్ బలంగా ఢీ కొట్టుకోవడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. బులోరా డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరకి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని స్థానికులు 108 ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హన్మండ్లు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News