Friday, January 10, 2025

బంజారాహిల్స్‌లో బైకును ఢీకొట్టిన కారు: ఇద్దరికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గంజాయి, మద్యం మత్తులో ఓ వ్యక్తి బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బంజారాహిల్స్ రోడ్ నెం 2, క్రీమ్‌స్టోన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. వివరాల ప్రకారం.. కారు డ్రైవర్‌ అనుష్‌రావు తన స్నేహితుడు కొత్తపేటకు చెందిన పవన్‌ కల్యాణ్‌రెడ్డితో కలిసి మద్యం, గంజాయి సేవించి అతి వేగంతో కారు నడుపుతున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

కారును వెంబడించి అడ్డగించి అనుష్ రావును పట్టుకున్నారు. పోలీసులు కారులో తనిఖీ చేయగా 50 గ్రాముల గంజాయి, గంజాయి నింపిన సిగరెట్లు లభించాయి. ప్రమాదం అనంతరం పోలీసులు మద్యం మత్తులో ఉన్న యువకుల రక్తం, వెంట్రుకల నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. అనంతరం నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News