Sunday, January 19, 2025

టెహరాన్‌లో ఇద్దరు జడ్జీలు కాల్చివేత

- Advertisement -
- Advertisement -

ఇరాన్ రాజధాని టెహరాన్‌లో శనివారం ఇద్దరు జడ్జీలను కాల్చి చంపేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ ఇద్దరు జడ్జీలు 1988లో అసమ్మతివాదులకు మూకుమ్మడిగా మరణశిక్ష విధించిన వారిలో ఉన్నారు. న్యాయమూర్తులైన మతాధికారులు మొహమ్మద్ మొఘైషే, అలీ రజినీలను కాల్చి చంపిన ఉదంతంలో ఏ గ్రూపు తామేనని చెప్పలేదు. ఇరాన్ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో వారి హత్య జరిగింది.

ఈ ఇద్దరు జడ్జీలు ఇరాన్ సుప్రీం కోర్టులో పనిచేశారని ప్రభుత్వ వార్తా సంస్థ ఇర్నా పేర్కొంది. కాగా ఈ కాల్పుల ఉదంతంలో ఓ జడ్జీ బాడీగార్డు కూడా గాయపడ్డాడు. గమనార్హం ఏమిటంటే గన్‌మాన్ తరువాత తనను తాను కాల్చుకుని చనిపోయాడు. ప్రస్తుతం ఈ ఉదంతానికి సంబంధించిన దర్యాప్తు చేపట్టారు. ఈ ఉగ్రవాద చర్యకు కారణమైన వారిని గుర్తించి, అరెస్టు చేయడానికి దర్యాప్తును ముమ్మరం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News