Wednesday, January 22, 2025

పట్టణాల్లో ఐటి వెలుగులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ఏర్పడిన తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మ హబూబ్‌నగర్‌లలో ఐటి టవర్లను ప్రారంభించామని ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణలోని టైర్ -2 పట్టణాల్లో ఐటీ కంపెనీల ఏర్పాటుకు సంబంధించి అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో 30కి పైగా కంపెనీల సిఇఒ లతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. ఈ స మావేశాన్ని టెక్నోజెన్ ఇంక్ (వాషింగ్టన్ డిసి) సి ఇఒ లక్ష చేపూరి, ఐటి సర్వ్ అలయన్స్ సంస్థ సా యం, మద్దతుతో నిజామాబాద్‌కు చెందిన మ హేష్ బిగాల (బిఆర్‌ఎస్, ఎన్‌ఆర్‌ఐల కో ఆర్డినేట ర్) సమన్వయం చేశారు. విజయవంతంగా నడుస్తున్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్ ఐటి- హబ్‌లకు నిరంతర మద్ధతు, నిబద్ధతతో సహకరిస్తున్న ఎన్నారైలు లక్ష చేపూరి, వంశీరెడ్డి, కార్తీక్ పొలసానిలను కెటిఆర్ ఈ సందర్భంగా అభినందించా రు. ఈ సమావేశంలో ఐటి, పరిశ్రమల శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్ధన్ రెడ్డి, చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ అమర్‌నాథ్‌రెడ్డి ఆత్మకూరి తదితరులు హాజరయ్యారు.

సిద్దిపేటలో త్వరలో ఐటి టవర్ ప్రారంభం

ఈ సందర్భంగా కెటిఆర్ తెలంగాణలోని టైర్-2 పట్టణాల్లో ఐటి వృద్ధిని ఎత్తిచూపుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, టైర్-2 పట్టణాల్లో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాలని పారిశ్రామిక వేత్తలకు మంత్రి పిలుపునిచ్చారు. సిద్దిపేటలో ఐటీ టవర్ త్వరలో ప్రారంభం కానుండగా, నిజామాబాద్, నల్గొండలో టవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని కెటిఆర్ తెలిపారు. అలాగే ఆదిలాబాద్‌లో ఐటి టవర్‌ను ప్రభుత్వం కొన్ని నెలల క్రితం మంజూరు చేసిందని మంత్రి తెలిపారు.

యువతకు అవకాశాలు కల్పించాలన్న ఉద్ధేశ్యంతో….
హైదరాబాద్‌లో కాకుండా ఇతర నగరాల్లో యువతకు డీకాంజెస్ట్, డీకార్బనైజ్, వికేంద్రీకరణ, పుష్కలంగా అవకాశాలు కల్పించాలన్న ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఎన్నారైలు తమ స్వగ్రామాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలని కెటిఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని నగరాలు, పట్టణాల్లో ఐటిని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాల్లో ఐటి ఎంతగా అభివృద్ధి చెందుతుందో మంత్రి కెటిఆర్ సవివరంగా తెలియచేశారు. అతి త్వరలో రాష్ట్రంలోని టైర్-II నగరాల్లో 2,500 కంటే ఎక్కువమంది ఐటి ఉద్యోగాలు పొందుతారని, తద్వారా 10,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని కెటిఆర్ పేర్కొన్నారు.

బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీలు పనిచేయడం ఆశ్చర్యం
బెల్లంపల్లిలో రెండు ఐటీ కంపెనీలు పని చేయడం ఆశ్చర్యంగా ఉందని, ఇటీవల బెల్లంపల్లిలో పర్యటించిన సందర్భాన్ని మంత్రి కెటిఆర్ ఉదహరించారు. కోవిడ్ 19 మహమ్మారి ఐటి కంపెనీల పనితీరులో ఒక మార్పును తీసుకొచ్చిందని, తక్కువ ఖర్చుతో కూడిన నిర్వహణతో ఉద్యోగులు ఎక్కడి నుంచైనా సమర్థవంతంగా పని చేయగలరని నిరూపించారని మంత్రి తెలిపారు. టైర్-II పట్టణాల్లో మెరుగైన కనెక్టివిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు సంస్థలు పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని కెటిఆర్ తెలిపారు. పలువురు సిఈఓలు నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ వంటి నగరాల్లో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News