Sunday, December 22, 2024

గంజాయి కేసులో ఇద్దరికి జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

మధిర : మధిర ఎక్సైజ్ స్టేషన్‌లో 2017లో అక్రమంగా కోణార్క్ రైలులో గంజాయి రవాణా చేస్తూ ఇద్దరు ఒడిసా రాష్ట్రానికి చెందిన ధను బెహరా, తూఫాన్ బెహెరా అను ముద్దాయిలు పట్టుబడగా, అట్టి ముద్దాయిలకు శుక్రవారం ప్రథమ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి, ఖమ్మం కె.ఉమాదేవి ఒక్కోకరికి 20 సంవత్సరాలు జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో మధిర ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, కె.నాగేశ్వర్ రావు, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి. చంద్రశేఖర్, కోర్టు కానిస్టేబుల్ పి. గోపి పబ్లిక్ ప్రాసక్యూటర్: కొత్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News